Posts

మానవజాతి జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేసే యుగనిర్మాణ సత్సంకల్పాలు.

Image
                                   యుగ నిర్మాణ సత్సంకల్పాలు. పూజ, జపం ముగించిన తర్వాత వీటిని నిత్యమూ చదువుతూ ఉండాలి. 1. ఈశ్వరుని సర్వవ్యాపకునిగాను, న్యాయనిర్ణేతగానూ,  మేము అంగీకరించి, ఆయన ఆజ్ఞలను మా జీవితంలో తీర్చిదిద్దుకుంటాము. 2. శరీరాన్ని దైవమందిరంగా భావించి, ఆత్మసంయమనం, నియమపాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాము. 3. మనస్సును దురాలోచనలు, దుర్వ్యసనాల నుండి రక్షించుకొనుటకై స్వాధ్యాయ సత్సంగాలను ఏర్పాటు చేసుకుంటాము. 4. ఇంద్రియ సంయమం, అర్థ సమయం, సమయ సంయమం మరియు ఆలోచనా సంయమాలను  నిరంతరమూ అభ్యసిస్తుంటాము. 5. మమ్ము మేము సమాజం యొక్క అభిన్న అంగాలుగా గుర్తించుకొని, అందరి హితములోను మా హితాన్ని చూసుకుంటాము. 6. విధులను నిర్వర్తిస్తాము. చేయకూడని పనులు చేయము. పౌర బాధ్యతలను పాటిస్తాము. 7. వివేకము, నిజాయితీ, బాధ్యత, పరాక్రమం జీవితంలో అవిచ్ఛిన్నమైన ఒక అంగంగా గుర్తిస్తాము. 8. నలుదిక్కులా మధురమైన, స్వచ్ఛమైన, నిరాడంబరమైన, సహృదయ వాతావరణాన్ని నిర్మిస్తాము. 9. అవినీతితో పొందిన సాఫల్యం కంటే, నీతితో...